Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాటి తరానికి, నేటి తరానికే కాదు రాబోయే తరాలకు కూడా లెజండరీ దర్శకులు కోడిరామకృష్ణ జీవితం స్ఫూర్తిదాయకం అని సుమన్ అన్నారు. కోడిరామకృష్ణ జయంతిని పురస్కరించుకుని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో ప్రసాద్ ల్యాబ్‌లో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ యం.యల్.ఎ బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్, బి.ప్రవీణ్ కుమార్ విచ్చేశారు. సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన సుమారు 30 మందికి కోడి రామకృష్ణ పేరుతో అవార్డులను ఇవ్వగా, హీరో సుమన్‌కి కోడిరామకష్ణ జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డును నిర్వాహకులు అందజేశారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, 'నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకష్ణగారే. ఈ రోజు ఆయన పేరుతో జీవన సౌఫల్య పురస్కార అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను' అని అన్నారు
నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ, 'నేను 'చెవిలో పువ్వు' సినిమాకు నిర్మాతగా ఉన్నపుడు కోడిరామకష్ణ గారిని కలిశాను. అప్పుడు ఆయన నాకు 'భారత్ బంద్' సినిమాలో మంచి వేషం ఇస్తాను, చెయ్యమని చెప్పారు. నేను చేయలేను, నాకు భయం అన్నప్పటికీ వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. నాలాగే ఎందరో ఆర్టిస్టులను ఆయన తీర్చి దిద్దారు' అని చెప్పారు.