Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జై జాస్తి, అనంతిక జంటగా సన్నీల్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'రాజమండ్రి రోజ్ మిల్క్'.
నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రం బందం తాజాగా ఈ చిత్ర టైటిల్‌సాంగ్‌ను సోమవారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'గీత రచయిత చంద్రబోస్ రచించిన 'నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా.. ఉండే నిండుగా..' ఫస్ట్‌డే ఫస్ట్ షో చూసినట్టుగా అనే సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజరు అరసాడ బాణీలు అందించిన ఈ సాంగ్‌ను విడుదల చేశాం. పాటకు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజరు అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్, డీఓపీ: ముఖేష్.జి, శక్తి అరవింద్, సాహిత్యం: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి, ప్రొడక్షన్ డిజైనర్: అభిషేక్ రాఘవ్.