Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెజెండ్ శరవణన్ మల్టీ లాంగ్వెంజ్ భారీ పాన్-ఇండియా చిత్రం 'ది లెజెండ్'తో కధానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మాస్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జెడి-జెర్రీ.
ఊర్వశి రౌటేలా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ కీలక పాత్రలు పోషించారు.
లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ అధినేత తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేేస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో లెజెండ్ శరవణన్, ఊర్వశి రౌటేలా, లక్ష్మీ రారు, జేడీ జెర్రీ, ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లెెజెండ్ శరవణన్ మాట్లాడుతూ,'ఒక కామన్ మాన్ ఎలా లెజెండ్‌గా ఎదిగాడు?, అతని ప్రయాణంలో ఎలాంటి సవాల్‌ని అధిగమించాడనేది ఈ చిత్రంలో అద్భుతంగా చూపించాం. ఇది చాలా భారీ చిత్రం. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ.. ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేశారు. ఈనెల 28న మీ ముందుకు వస్తుంది. మీరంతా చూసి విజయవంతం చేయాలి' అని చెప్పారు.
'శరవణన్ స్టోర్ అనేది తమిళనాడులో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఒక బ్రాండ్. ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేేయటమే కాకుండా లెజెండ్ శరవణన్ యాక్ట్ చేశారు. చాలా రిచ్‌గా ఉంటుంది. కొత్త కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్‌ని ఎప్పుడూ ఆదరిస్తారు. ఇది ఆయన మొదట సినిమా, అయినప్పటికీ ప్రేక్షకులు చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అవుతారు. ఒక సక్సెస్ ఫుల్ చిత్రానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి, మంచి విజయాన్ని అందించాలి' అని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.
జెడి మాట్లాడుతూ, 'ఇది చాలా బిగ్ బడ్జెట్ మూవీ. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లో చూడాలి. లెజెండ్ శరవణన్‌గారు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. ఒక నటుడిగా ఆయనకి చాలా కమిట్మెంట్ ఉంది. సినిమా అంటే చాలా ప్యాషన్ ఉంది. ఆయన డెడికేషన్ని స్క్రీన్‌పై చూస్తారు. ఊర్వశి రౌటేలా అద్భుతంగా చేసింది. లక్ష్మీ రారు స్పెషల్ ఎప్పిరియన్స్లో ఆకట్టుకుంటుంది' అని అన్నారు.
'లెజెండ్ శరవణన్ ఎక్కడా రాజీపడకుండా రూపొందించారు. నటుడిగా అన్ని కోణాల్లో అద్భుతంగా చేశారు. ప్రసాద్ గారు అద్భుతమైన నిర్మాత. ఆయన తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది' అని జెర్రీ చెప్పారు.