Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ రూపొందించారు.
ఈ చిత్రం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదల కానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా మేకర్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్ మూవీ. ఇంతకుముందు ఎప్పుడూ చేయని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. దర్శకుడు శరత్ చాలా అద్భుతమైన సినిమా తీశాడు. నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. నాని అంటే నాకు చాలా ఇష్టం. వేణు తొట్టెంపూడితో నేను 'స్వయంవరం' సినిమా చేయాలి. కానీ మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా చేశాం. ఈ సినిమాకి సౌండ్ చాలా ముఖ్యం. దీనికి వందశాతం న్యాయం చేశాడు సామ్ సిఎస్. ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు' అని తెలిపారు.
'ఈ సినిమాకి చాలా పాజిటివ్ వైబ్ ఉంది. నా 'దసరా' సినిమా చేస్తున్న నిర్మాతలే ఈ సినిమా చేస్తున్నారు. బాక్సాఫీసు సక్సెస్‌తో పాటు మంచి కంటెంట్ ఉండే సినిమా ఇవ్వాలనే తపన మా నిర్మాతల్లో ఉంది. ఈ సినిమా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న కాంబినేషన్ అనిపిస్తుంది. వేణుగారు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టడం ఆనందంగా ఉంది' అని నాని చెప్పారు.
దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ,'ట్రైలర్ ఎంత బావుందో అంతకంటే గొప్పగా సినిమా ఉంటుంది. ఈ సినిమా మీకు యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మా సినిమా టికెట్లు సాధారణ ధరలకే అందుబాటులో ఉంటాయి. తెలంగాణలోని మల్టీఫ్లెక్స్‌లో 195, సింగిల్ స్క్రీన్స్‌లో 150, 100, 50 రూపాయిలు. ఆంధ్రప్రదేశ్‌లో రేట్లు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అక్కడ 177, 147, 80 రూపాయిలుగా టికెట్ ధరలు ఉన్నాయి' అని అన్నారు.
'నా మిత్రుడు రవితేజ గారికి హదయపూర్వక కతజ్ఞతలు. ఆయన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. నా పై నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చిన సుధాకర్, శ్రీకాంత్, దర్శకుడు శరత్ మండవ గారికి థ్యాంక్స్' అని వేణు తొట్టెంపూడి చెప్పారు.
సంగీత దర్శకుడు సామ్ సిఎస్ మాట్లాడుతూ, 'అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే ఉన్న సినిమా. ఈ కథకి సంగీత ప్రాధన్యత కూడా వుంది. మ్యూజికల్ గా నా బెస్ట్ ఇచ్చాను. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఇంత మంచి సినిమా ఇచ్చిన రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కతజ్ఞతలు' అని తెలిపారు.