Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'బింబిసార'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ అనేది ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో ఇందులో నాయికగా నటించిన సంయుక్తా మీనన్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. 'పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమాలో రానా వైఫ్‌గా నటించాను. నా పాత్రను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడే ధనుష్ తెలుగు, తమిళంలో నటిస్తున్న 'సార్' చిత్రంలోనూ నటించే అవకాశం వచ్చింది. ఇదే టైమ్‌లో 'బింబిసార'లోనూ ఛాన్స్ రావడం ఆనందంగా అనిపించింది. 'బింబిసార' అనేది టైమ్ ట్రావెల్ ఫాంటసీ చిత్రం. ఇందులో నా క్యారెక్టర్ ప్రజెంట్లో ఉంటుంది. చాలా మోడ్రన్ క్యారెక్టర్ కూడా. నాకు పీరియాడిక్ చిత్రాల్లో నటించమంటే ఎంతో ఇష్టం. నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు 'బాహుబలి', 'బాజీరావు మస్తానీ' చిత్రాలను చూశా. దర్శకుడు వశిష్ఠ్‌కి కథ మీద చాలా క్లారిటీ ఉంది. ఈ కథని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక కళ్యాణ్‌రామ్ గురించి చెప్పాలంటే, ఆయన కళ్ళే యాక్ట్ చేస్తాయి. 'బింబిసార'గా ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ధనుష్ 'సార్' చిత్రంలో నటిస్తున్నాను. పాత్ర నచ్చితే ఏ భాషలోనైనా నటిస్తాను' అని సంయుక్తా మీనన్ తెలిపింది.