Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'విక్రాంత్ రోణ' చిత్ర ప్రీ రిలీజ్లో నాగార్జున
కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ చిత్రం 'విక్రాంత్ రోణ'.
ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేశారు. జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
సల్మాన్ ఖాన్ ఫిలింస్ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉత్తరాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు.
ఇన్వెనియో ఆరిజన్స్ బ్యానర్‌పై అలంకార్ పాండియన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, 'సుదీప్ 'విక్రాంత్ రోణ' చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సాధారణంగా ఇక్కడ ఈ సినిమా తీశారు అని గర్వంగా ఫీలై, పెద్ద పెద్ద పోస్టర్స్ పెడతాం. ఇంతకు ముందు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' పెట్టాం. 'విక్రాంత్ రోణ' ట్రైలర్ రిలీజ్ తర్వాత చూసి అన్నపూర్ణలో పెద్ద పోస్టర్ పెట్టేస్తారనిపించింది. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాను త్రీడీలో తీశారని అంటున్నారు. కచ్చితంగా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. మా తెలుగు ఆడియెన్స్‌కు చాలా మంచి మనసు. ఎందుకంటే మా వాళ్లకు సినిమా నచ్చిందంటే బ్లాక్‌బస్టర్ చేస్తారు' అని చెప్పారు.
'ఈ సినిమాకు హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే 65-70 శాతం సినిమా చిత్రీకరణను ఇక్కడే చిత్రీకరించాం. అందులో ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోలోనే చిత్రీకరించాం. 500-600 మంది అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్‌లో ఉన్నాం. మూడు నెలలు అక్కడ చిత్రీకరణ చేసినా ఒక కరోనా కేస్ కూడా రాలేదు. ఆర్ట్ డైరెక్టర్ శిబు లేకుండా ఉండుంటే అనూప్ ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసుండలేడు. అలాగే అజనీష్ తన మ్యూజిక్‌తో సినిమాను పది మెట్లు పైకి తీసుకెళ్లాడు. నిర్మాత జాక్ మంజు లేకపోతే సక్సెస్‌ఫుల్‌గా జర్నీని పూర్తి చేసేవాళ్లం కాదు. ఈ చిత్రంతో వన్ ఆఫ్ ది బెస్ట్ 3డీ ఎక్స్‌పీరియెన్స్ ఫీల్ అవుతారని ప్రామీస్ చేస్తున్నాను' అని కిచ్చా సుదీప్ చెప్పారు.
చిత్ర దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ, ''విక్రాంత్ రోణ' అనేది నా 20 ఏళ్ల కల. సుదీప్గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేశాను. నాకు గర్వంగా ఉంది. అక్కినేని ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. 'గీతాంజలి' సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఈ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు నాగార్జునగారు ప్రత్యేకంగా పిలిచి మరీ అభినందించారు' అని చెప్పారు.