Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ లేటెస్ట్గా నటించిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శరత్ మండవ మీడియాతో ముచ్చటించారు.
యూనిక్ థ్రిల్లర్
రవితేజ లాంటి మాస్ స్టార్ చేస్తున్న లార్జర్ దేన్ లైఫ్ ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్ ఇది. ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు లేకపోతే క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్‌గా రామారావు ఈ కేసుని ఎందుకు డీల్ చేశాడనేది ఈ సినిమాలో చాలా యూనిక్ పాయింట్. కలెక్టరేట్‌తో ముడిపడిన విభాగాలన్నీంటికీ చాలా వ్యవస్థలపై ప్రత్యేక అధికారాలు ఉంటాయి. కోర్టులు పని చేయనప్పుడు కలెక్టరేట్‌కు ఆదేశాలు ఇచ్చే హక్కు ఉంటుంది. కథలో ఇసుక మాఫియా అంశాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశాం.
యదార్థ సంఘటనల ఆధారంగా..
కొన్ని యదార్ధ సంఘటనలు ఆధారంగా సినిమా రూపొందించాం. అందులో ఒక సంఘటన నా అనుభవంలో కూడా వుంది. ఇది పాత్ బ్రేకింగ్ కథ అని చెప్పను కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని మాత్రం చెప్పగలను. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ఎక్కువగా ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఇక రవితేజ గారు అంటే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ని ఆశిస్తారు. ఆడియన్స్‌ని యంగేజ్ చేసే ఫన్ ఫ్యాక్టర్ ఇందులో చాలా ఉంది. రవితేజగారి గత సినిమాల ఛాయలను రిపీట్ కాకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.
రామారావు అనేది పవర్ఫుల్ నేమ్
రాామారావు అనేది పవర్ ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీగా ఆయన పేరు వచ్చింది. తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌గారు బిగ్ హీరో. అలాగే కేటీఆర్ గారు కూడా గ్రేట్ లీడర్. ''రామారావు' అనేది ఒక స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం. అందుకే ఈ పాత్రకు రామారావు అని పేరు పెట్టాను. ఇందులో వేణు తొట్టంపూడిది చాలా కీలకమైన సిఐ పాత్ర. ఎమోషన్స్‌ని అద్భుతంగా పడించే నటుడాయన. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ప్యాషన్ ఉన్న నిర్మాతలు
సుధాకర్ చెరకూరి, శ్రీకాంత్ గారు అద్భుతమైన నిర్మాతలు. మంచి సినిమా చేయాలనే తపనతో వుంటారు. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితిల్లో కూడా ఈ సినిమాని ఇంత గ్రాండ్‌గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం వారి గొప్ప సంకల్పం వల్లే సాధ్యమైంది. సినిమాని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు.