Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'ఫస్ట్ డే ఫస్ట్ షో'.
మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
సరికొత్త కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తికరమైన ప్రమోషన్స్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో 'నీ నవ్వే' పాటని తాజాగా చిత్ర బందం విడుదల చేసింది.
హీరో తన ప్రేయసి ప్రేమ ఊహల్లో తేలుతున్న ఈ పాట విన్న వెంటనే ఆకట్టుకుంది. ఈ పాటకు రాధన్ కంపోజ్ చేసిన ట్యూన్ చాలా యూత్ ఫుల్‌గా ఉంది. 'కొత్తగా ఊపిరందుకుంది ఊపిరి
సూటిగా సాగిపొమ్మని ఆశగా తెల్లవారుతుంది రాతిరి నిండుగా రేపు నాదని నీ నవ్వే నీ చిరునవ్వే...' అంటూ రామజోగయ్య శాస్త్రి పాటకు అందించిన సాహిత్యం, రామ్ మిరియాల పాడిన ఈ పాట హుషారుగా సాగింది. లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ రెడ్డి కూల్ ఫెర్ఫార్మెన్స్, సంచితా బషు క్యూట్ స్మైల్ అందర్నీ అలరిస్తున్నాయి. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, మాధవ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.