Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ క్యురియాసిటీని పెంచుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ దూకుడు పెంచిన చిత్ర యూనిట్. తాజాగా మాచర్ల యాక్షన్ ధమ్కీని రిలీజ్ చేసింది.
దీనికి వస్తున్న రెస్పాన్స్ గురించి చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఈ మాస్ ఎంటర్టైనర్కి సంబంధించిన అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ చూపించే ట్రెమండస్ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిన్న కట్లో అద్భుతంగా చూపించారు. మాచర్ల యాక్షన్ ధమ్కీలో అదిరిపోయే డైలాగ్, అద్భుతమైన యాక్షన్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందర్నీ అలరిస్తున్నాయి. 'మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాధులుగా వేశారు. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి నేను సిద్ధం' అని నితిన్ చెప్పిన డైలాగ్ హీరో పాత్రని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా సినిమాపై మరింత క్యూరీయాసిటీని పెంచింది.
యాక్షన్ ధమ్కీ సష్టించిన మాస్ మానియా నుండి ప్రేక్షకులు బయటకు రాకముందే.. ఈ నెల 30న గుంటూరులో జరిగే భారీ పబ్లిక్ ఈవెంట్లో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తు ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ 'రారా రెడ్డి..'లో సందడి చేయనుంది. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపింది.