Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విక్రమ్, అమత చౌదరి ప్రధాన పాత్రల్లో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో 'విక్కీ ది రాక్ స్టార్' అనే ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మాత, సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు.
తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. 'విక్కీ ది రాక్ స్టార్' నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ షేడ్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించేలా లవ్ షేడ్‌ను విడుదల చేశారు. 'ఎంత బాగుందో.. ఇలా నీ పక్కన ఉండటం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంది..ఐ వాంట్ టు స్టే ఫరెవర్' అంటూ అంటూ సాగే ఈ లవ్ షేడ్‌లో ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ఇందులో రొమాంటిక్ సీన్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సునీల్ కశ్యప్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఎవ్వరూ చేయని జోనర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించారు. అలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌ని టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు.