Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెలుగు, తమిళంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం 'సార్' (తెలుగు), 'వాతి' (తమిళం). ఈ సినిమా చిత్రీకరణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతత్వంలోని సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్నారు.
గురువారం (నేడు) కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఒక రోజు ముందే తెరతీస్తూ 'సార్' తొలి ప్రచార చిత్రాన్ని చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో ధనుష్ లెక్చరర్‌గా కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపథ్యంలో జరిగే కథ అని తాజాగా రిలీజైన ప్రచార చిత్రం, అలాగే నేడు (గురువారం) మా హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న వీడియో స్పష్టం చేస్తాయి. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతోంది చిత్రం. దీనికి తగినట్లుగా ధనుష్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆయన అందిస్తున్న సహకారం, ఆయనతో ప్రయాణం మర్చిపోలేనిది. జివి ప్రకాష్ సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయి అని నమ్ముతున్నాను. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది' అని అన్నారు.
'మా 'సార్' చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం' అని నిర్మాత నాగవంశీ తెలిపారు.
సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎడిటర్: నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్: జె.యువరాజ్, మ్యూజిక్: జి.వి. ప్రకాష్‌కుమార్, యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాతలు: నాగవంశీ ఎస్., సాయి సౌజన్య, రచన- దర్శకత్వం: వెంకీ అట్లూరి.