Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లో రిలీజ్ అవుతుంది.
శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. సినిమా విడుదలకు రెండు రోజులు ఉండగా, 'రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్'గా మరో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ మినీ ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనికి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మాట్లాడుతూ, ''రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్' బ్రిలియంట్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అందర్నీ అలరించింది. 'నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండయ్యే వాడిని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని' అని రవితేజ చెప్పిన డైలాగ్ థియేటర్లో ఫ్యాన్స్‌తో విజల్స్ వేయించే మూమెంట్‌లా ఉంటుంది. 'మీ ఆయన మెరుపు లాంటి వాడు. శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం' అని తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్ రామారావు పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో తెలియజేసింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ పవర్ ఫుల్‌గా ఉంటూ అదే సమయంలో చాలా యూనిక్‌గా ఉన్నాయి. సామ్ సిఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్‌గా ఉంది. దర్శకుడు శరత్ మండవ ఫ్యాన్స్, మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని సిద్ధం చేశారని ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఫ్రూవ్ చేసింది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపిస్తారు' అని తెలిపింది.
నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, 'సర్పట్ట'ఫేమ్ జాన్ విజరు, చైతన్య కష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, సంగీతం: సామ్ సిఎస్, డివోపీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.