Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్, మణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకుడు. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ బుధవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
కథ ఇచ్చిన స్ఫూర్తే కారణం
'సీతారామం' కథ అద్భుతం. దర్శకుడు హను రాఘవపూడి చాలా గొప్ప కథ రాశారు. కథలో పాటలు వచ్చే సందర్భాలు అద్భుతంగా ఉంటాయి. మంచి మ్యూజిక్ రావాలంటే కథ మ్యూజిక్‌ని డిమాండ్ చేయాలి. అలా మ్యూజిక్‌ని డిమాండ్ చేసిన కథ ఇది. 'సీతారామం'కు గొప్ప మ్యూజిక్ రావడానికి కారణం ఈ కథ ఇచ్చిన స్ఫూర్తి. దర్శకుడు హనుతో గతంలో 'పడిపడి లేచే మనసు' సినిమా చేశాను. ఆయన కథ రాసుకునే విధానం అద్భుతంగా ఉంటుంది.
అద్భుతమైన మ్యూజిక్ జర్నీ
ఈ సినిమా మ్యూజిక్ జర్నీ అద్భుతంగా సాగింది. 'కానున్న కళ్యాణం' పాట రాసిన సిరివెన్నెల గారు సాంగ్ కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి రావడం నా అదష్టంగా భావిస్తున్నా. నాకు చాలా విషయాలు చెప్పారు. పాటలను ఇతర భాషల్లో డబ్బింగ్‌లా కాకుండా వాటి నేటివిటికి తగ్గట్టు ఒరిజినల్‌గా చేశాం. ఎస్పీ చరణ్‌తో పాడించాలనే ఛాయిస్ నిర్మాతలది. గ్రేట్ బాలు గారిలా మరొకరు పాడుతున్నారంటే పాడించుకోవడం ఆనందమే కదా. అలాగే 'ఇంతందం..' పాటలో పిల్లలతో పాడించిన కోరస్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు లభించాయి. పిల్లలతో కోరస్ పాడించాలానే ఆలోచన దర్శకుడు హను గారిది. ఈ పాట విన్నపుడు.. ఇక్కడ పిల్లలతో కోరస్ పాడిస్తే ఎలా వుంటుందని అన్నారు. రికార్డ్ చేశాం.. అద్భుతంగా వచ్చింది.
ఇంత రిచ్ మ్యూజిక్ ఎప్పుడూ చేయలేదు
సీతారామంలో అద్భుతమైన నేపత్య సంగీతం వినబోతున్నారు. జర్మనీ, యుఎస్, ఫ్రాన్స్,.. ఇలా విదేశీ వాయిద్యకారులతో పాటు దాదాపు మరో 140 మంది య్యూజిషియన్స్ నేపథ్య సంగీతం కోసం పని చేశారు. అలాగే నేపథ్య సంగీతంలో చాలా రాగాల మీద వర్క్ చేశాం. సంప్రదాయ సంగీతం పరంగా 'సీతరామం' చాలా రిచ్‌గా ఉంటుంది. మ్యూజిక్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాం. నేను, నా భార్య, టీమ్.. రౌండ్ ది క్లాక్ పని చేశాం. ఇలాంటి స్టయిల్లో ఇంత రిచ్ మ్యూజిక్ గతంలో నేను ఎప్పుడూ చేయలేదు. మ్యూజికల్‌గా చాలా రిచ్‌గా ఉంటుంది. ఆర్గానిక్‌గా చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం 60, 80 దశకాలలో తెలుగు సినిమాల్లో ఎలాంటి రాగాలతో పాటలు వచ్చాయనే విషయంలో రీసెర్స్ చేేశాను. ఇందులో మొత్తం తొమ్మిది పాటలు వున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి.