Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో ఆసక్తికరంగా రాబోతున్న చిత్రం 'కమిట్మెంట్''.
రచన మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రమిది.
ఇందులో తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభరు రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 19న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి మాట్లాడుతూ, 'ఓ మంచి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సపోర్ట్ చేసి, మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. నాలుగు భిన్న కథల సమాహారంగా ఈ సినిమా ఉండనుంది. 'కమిట్మెంట్' అనే టైటిల్ ఎందుకు పెట్టాం?, ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అనేది మాటల్లో కంటే వెండితెర మీద చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మా దర్శకుడు చెన్న ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరెక్కించాడు. ఆయన మాకు చెప్పిన దానికంటే ఎంతో చక్కగా తెరకెక్కించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.