Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బింబిసార'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్ లైన్.
వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్ట్ 5న సినిమా రిలీజ్ అవుతుంది.
ఈనెల 29న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. హీరో ఎన్టీఆర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం బింబిసార చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
సినిమా రిలీజ్ ట్రైలర్లో కళ్యాణ్ రామ్ పాత్రలోని వేరియేషన్స్.. అందుకు తగ్గట్టు ఆయన టెరిఫిక్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి ట్రైలర్‌కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా.. హద్దులను చేరిపేస్తే మన రాజ్యపు సరిహద్దులను ఆపే రాజ్యాలను దాటి విస్తరించాలి.. శరణు కోరితే ప్రాణ భిక్ష.. ఎదిరిస్తే మరణం అంటూ బింబిసారుడిలా పీరియాడిక్ గెటప్‌లో కనిపించిన నందమూరి కళ్యాణ్ రామ్.. పవర్ఫుల్ నటనతో మెప్పించారు. ఆ వెంటనే.. నీ కలల సామ్రాజ్యాన్ని సాధించే బింబిసారుడు వస్తున్నాడు చూడు అనగానే స్టైలిష్‌గా కనిపిస్తూ విలన్స్ భరతం పడుతూ మరో కోణంలోనూ ఆయన అలరించారు. నాడైనా నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడు కత్తిని దాటాలంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ వింటుంటే గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఈ ఎగ్జైట్మెంట్ను ఆగస్ట్ 5 వరకు వేచి చూడాల్సిందేనని చిత్ర బృందం తెలిపింది.
ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ మ్యూజిక్. ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, డాన్స్: శోభి, రఘు, ఫైట్స్: వెంకట్, రామకష్ణ, వి.ఎఫ్.ఎక్స్: అనిల్ పడూరి, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఎడిటర్: తమ్మిరాజు.