Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుష్ కథానాయకుడిగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందుతున్న ద్విభాషా చిత్రం 'సార్'. ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం 'సార్' (తెలుగు), 'వాతి' (తమిళం) చిత్రీకరణ కార్యక్రమాలు దాదాపు ముగింపు దశలో ఉన్నాయి.
ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్, ఎమోషన్ మేళవింపుగా 'సార్' టీజర్ ఉంది. అలాగే పాత్రల మధ్య సంభాషణలు సైతం ఇందుకు అద్దం పడుతున్నాయి. 'జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్' ఇదే రా ఇప్పటి ట్రెండ్.. అని ఓ పాత్ర అంటుంది ఓ సందర్భంలో.. మరోచోట ఓ లెక్చరర్ ''త్రిపాఠి మన కాలేజ్‌లోని బెస్ట్ లెక్చరర్స్‌ని గవర్నమెంట్ కాలేజీకి పంపించేస్తే మన దగ్గరకి వచ్చి చదువుకునేది ఎవరు...!' అని అంటారు. సమాధానంగా ''మనం పంపేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్‌ని'... అని ఆ పాత్ర చెబుతుంది.
''సార్... మై సెల్ఫ్ బాల గంగాధర్ తిలక్. త్రిపాఠి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌లో జూనియర్ లెక్చరర్.. అంటూ ఇందులో మనకు కనిపించే 'సార్' ''విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం. పంచండి...ఫైవ్ స్టార్ హౌటల్లో డిష్ లాగా అమ్మకండి' అంటాడు కథానాయకుడు ధనుష్ ఆవేదన మిళితమైన తీవ్ర స్వరంతో.... ముగింపుగా'' విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా సాగే ప్రయాణం, అందులోని సమస్యలు, సంఘటనలు 'సార్' జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నది అటు ఆసక్తిని, ఇటు ఉద్విగతకు గురి చేస్తుంది. టీజర్ విడుదలైన క్షణం నుంచే తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు సరైన బహుమతి అన్నట్లుగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అభిమానుల ఆనందం అంబరాన్ని అంటాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.