Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'ఆకాశ వీధుల్లో'. మనోజ్ డి జె, డా.మణికంఠ నిర్మాతలు. సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
'ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూడా శాండీ అందించిన పాటలు కూడా అందర్నీ విశేషంగా అలరిస్తాయి. భిన్న కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పిస్తుంది. గౌతమ్ కష్ణ, పూజిత పొన్నాడ పాత్రలు వినూత్నంగా ఉంటూ ఫిదా చేస్తాయి. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్త్రీని ఆహా అనేలా ఉంటుంది. సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా భారీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : జూడా శాండీ, కెమెరా : విశ్వనాథ్ రెడ్డి, ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్, సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గణపతి, నిర్మాతలు : మనోజ్ జెడి, డా. డీజే మణికంఠ, రచన, దర్శకత్వం : గౌతమ్ కృష్ణ.