Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సికె ఇంఫిని సమర్పణలో సీకె ఇంఫిని ఎంటర్త్సైన్మెంట్స్ బ్యాన్సర్పై భానూరి చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'సరసాలు చాలు'.
నరేష్ అగస్త్య, సంజన సారథి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌ని శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ టైటిల్ గ్లిమ్ప్స్ అన్నివర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా అందంగా ఉందని మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్ బాగా ఎంజారు చేశారు. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇదొక డిఫరెంట్ లవ్ స్టొరీ. కామెడీ, రొమాన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ, అందరినీ ఆలోచింపజేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి జంటకు కనెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్‌తో ఈ చిత్రం ఉండనుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న మా సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్.2 చర్చల్లో ఉంది. త్వరలో ఆ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నాం' అని అన్నారు.
వెంకట్, దివ్యవాణి, వెంకటేష్ కాకమాను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్: జైకాంత్ (బాబి), కెమెరామెన్: రోహిత్ బచ్చు, సంగీతం: భారత్ మాచిరాజు, ఎడిటర్: అశ్వత్ శివకుమార్.