Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్‌రాజ్ నటీనటులుగా నటిస్తున్న చిత్రం 'నేను కేరాఫ్ నువ్వు'.
సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె.జోషఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతున్న సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామకష్ణ ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న సాంగ్‌కు డ్యాన్స్ కంపోజ్ చేసి పంపిస్తే లక్ష రూపాయలు ప్రైజ్ మనీని అందజేస్తామని మేకర్స్ ఈ వేడుకలో తెలిపారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామకష్ణ మాట్లాడుతూ, 'నాకు ఈ చిత్ర దర్శకుడు సాగా పది సంవత్సరాల నుండి తెలుసు. సినిమా రంగంపై ఎంతో ఇంట్రెస్ట్‌తో ఇండిస్టీకి వచ్చాడు. ఇది సాగాకు రెండో చిత్రం. ఈ సినిమా కోసం తానే దగ్గరుండి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం.. అన్నీ చేసి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాడు. ఈ చిత్రంలో ఉన్న ఫైట్స్, మ్యూజిక్ చాలా బాగా వచ్చాయి. ఈ చిత్ర యూనిట్‌కు అల్ ద బెస్ట్' అని చెప్పారు.
'1980లో నా చిన్న తనంలో నేను దగ్గరగా చూసిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాను. ఈ చిత్రానికి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయితతో పాటు అందరూ నాకు మంచి స్నేహితులు. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలను దయచేసి సపోర్ట్ చేయండి.మా సినిమాను అందరూ ఆదరించండి' అని చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ తెలిపారు.
సహ నిర్మాత జోసెఫ్ మాట్లాడుతూ, 'దర్శకుడు సాగా చెప్పిన కథ నచ్చి, ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. సాగా ఎంతో విజనరీ ఉన్న డైరెక్టర్. పోస్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఓ వైపు వివాహ శుభకార్యాన్ని చూపిస్తూ, మరోవైపు సంకెళ్ళతో కాళ్ళను బంధించి ఒక చిన్న క్రైమ్ స్టోరీలా క్రియేట్ అయ్యేలా పోస్టర్ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కథ డిఫరెంట్‌గా ఉంటుందని అర్థం అవుతుంది. ఈ సినిమా చూశాను. విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను' అని అన్నారు.
'ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. సాగా నాకు సన్నివేశం చెప్పగానే రెండో రోజే పాట రాసిచ్చేవాడ్ని. అలా ఇందులో నాలుగు పాటలు నేనే రాశాను. నాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సాగా బాగా కో ఆపరేట్ చేశాడు. ఇంతమంచి అవకాశం ఇచ్చిన సాగాకు, నిర్మాతలకు కతజ్ఞతలు. ఓ మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాం. కచ్చితంగా ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాం' అని లిరిసిస్ట్ ప్రణవ్ తెలిపారు.