Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రావణ్ నిట్టూరుని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'.
డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని దర్శకురాలు నందిని రెడ్డి లాంచ్ చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ లుక్‌లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్‌గా నిల్చుని చూడటం, బ్యాగ్రౌండ్లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. తిరుపతిలోనే చిత్రీకరణ మొత్తం జరుపుకుంటున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకత షా, బొమ్మకంటి రవీందర్, అమత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: డిజికె, సంగీతం : ఫణి కళ్యాణ్, ఎడిటర్ : సత్య గిడుతూరి.