Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'బింబిసార'. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ అనేది క్యాప్షన్. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ అద్భుతంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'రెండేళ్ల క్రితం కళ్యాణ్ అన్న ఫోన్ చేసి.. చాలా ఇంట్రెస్టింగ్ కథ విన్నాను.. నువ్వు ఒకసారి వింటే బాగుంటుందని అన్నారు. ఇప్పుడు వశిష్ట అంటున్నారు.. అంతకు ముందు వేణు అనేవాళ్లు. నాకు కూడా తనని వేణు అని పిలిస్తే బావుంటుంది. ఆ రోజు ఒక ఐడియాగా బింబిసార కథ చెప్పాడు. ఆ రోజు మొదలైన భయం.. ఎక్స్పీరియన్స్ లేదు.. ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడా? లేడా? అనే భయం. ఎంత కసిగా కథను చెప్పాడో, అంత కంటే గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడు. ఇదేం చిన్న విషయం కాదు. మీ అందరి కంటే నేను అదష్టవంతుడిని. ఎందుకంటే ఈ సినిమాను నేను ముందుగానే చూశాను. కథ, కథనం తెలుసు. కథలో ఏం జరగబోతుందో కూడా తెలుసు. ఇంత తెలిసినా కూడా నేను సినిమా చూసేటప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. మీరంతా కూడా ఆ ఎగ్జైట్మెంట్కు గురవుతారు. వేణు తొలి సినిమానే ఇంత గొప్పగా తెరకెక్కించాడంటే.. ఇకపై తను ఎంత గొప్ప చిత్రాలను చేయగలడో అని చెప్పడానికి ఇదొక టీజర్‌లాంటిది. చోటా అన్నతో ఎన్నో సినిమాలు కలిసి చేశాం. ఎన్నో గొప్ప సినిమాలు ఆయన చేశాడు. ఈ సినిమాకి కొత్త చోటా కనిపించారు. ఎంతో ఊపిరి పోశాడు. బింబిసార సినిమా చూశాక నందమూరి కళ్యాణ్ రామ్ కాలర్ ఇంకా పైకి ఎత్తుతారు. అది మీరు చూస్తారు. కళ్యాణ్ అన్న కెరీర్.. బింబిసారకు ముందు.. బింబిసారకు తరువాత అవుతుంది' అని చెప్పారు.
'మన అందరికీ చందమామ కథలు, అమరచిత్ర కథలు, జాన పద చిత్రాలంటే ఇష్టం. వాటిని మొదలు పెట్టింది మా తాత గారు. బాబారు భైరవ ద్వీపం, చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు మన ముందుకు వచ్చాయి. అదే పంథాలో మీ ముందుకు మంచి సోషియో ఫాంటసీ సినిమా తీసుకు రావాలనే మా ప్రయత్నమే ఈ బింబిసార' అని నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు.