Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హీరో నిఖిల్
ప్రియాంక డే టైటిల్ రోల్లో సాయి తేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'హసీన'. ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటను విడుదల చేశారు. ఈ పాటకు షారుక్ షేక్ ట్యూన్‌ను అందించగా, ప్రసాద్ నల్ల అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను యువ కథానాయకుడు నిఖిల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ పాటను చూస్తుంటే.. కొత్త వాళ్లు చేసినట్టుగా లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి కొత్త జోనర్లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. టీజర్, ట్రైలర్ కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నేను కూడా సినిమాను చూస్తాను. కొత్త వాళ్లను, కొత్త జోనర్లను అందరూ ఎంకరేజ్ చేయాలి. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సాయి తేజకు శుభాకాంక్షలు' అని అన్నారు. 'మా లాంటి కొత్తవాళ్లకు నాని, నిఖిల్, రవితేజగారు స్ఫూర్తిగా ఉంటారు. మా సాంగ్‌ను నిఖిల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది' అని డైరెక్టర్ నవీన్ ఇరగాని చెప్పారు. నటుడు సాయి తేజ మాట్లాడుతూ, 'నిఖిల్ అన్న నా బర్త్ డే సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు.