Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'వాంటెడ్ పండుగాడ్'. 'పట్టుకుంటే కోటి' ట్యాగ్ లైన్.
శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'అబ్బా అబ్బా అబ్బబ్బ...' అనే లిరికల్ సాంగ్‌ను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.
దర్శకేంద్రుడు సినిమాల్లో ఆయన హీరోయిన్స్‌ని అందంగా చూపిస్తూనే ఆకర్షణీయంగా పాటను చిత్రీకరిస్తుంటారు. అలా ఆయన పాటలెన్నో ప్రేక్షకుల గుండెల్లో ఎవర్ గ్రీన్ పాటలుగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆయన సమర్పణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని 'అబ్బా అబ్బా అబ్బబ్బ..' సాంగ్ కూడా కలర్ఫుల్గా ఆకట్టుకుంటోంది. పి.ఆర్ సంగీతంతోపాటు పాటకు సాహిత్యాన్ని కూడా అందించారు. హారిక నారాయణ్, శ్రీకష్ణ పాటను పాడారు. సుడిగాలి సుధీర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, దీపికా పిల్లి, నిత్యా శెట్టి, విష్ణు ప్రియ, వాసంతి తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు' అని చిత్ర బృందం తెలిపింది.
'ఓ డిఫరెంట్ కథతో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది. దర్శకుడు శ్రీధర్ సీపాన ఈ కథను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు' అని మేకర్స్ చెప్పారు. చదీపికా పిల్లి, బ్రహ్మానందం, రఘుబాబు, అనంత్, పుష్ప జగదీష్, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ, హేమ, షకలక శంకర్, తనికెళ్ల భరణి, ఆమని, థర్టీ ఇయర్స్ పథ్వీ నటిస్తున్నారు.