Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నితిన్ నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'. గుంటూరులోని బ్రోడీపేట్లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో 'మాచర్ల నియోజకవర్గం' థియేట్రికల్ ట్రైలర్‌ను అగ్రదర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి అభిమానులు భారీగా హాజరయ్యారు. 'రారా రెడ్డి..' పాటలోని 'రానురాను అంటుంది చిన్నదోరు' పాపులర్ బిట్‌కి నితిన్‌తో పాటు కతి శెట్టి, కేథరిన్ థ్రెసా, అనిల్ రావిపూడి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అభిమానులను అలరించింది. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీ నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరో నితిన్ మాట్లాడుతూ, 'సై' హిట్ తర్వాత గుంటూరు వచ్చాను. అప్పుడూ ఇదే ప్రేమ ఇచ్చారు. తర్వాత 'అఆ' హిట్ తర్వాత వచ్చాను. మళ్ళీ అదే ప్రేమ చూపించారు. ఈసారి సినిమా ముందే వచ్చాను. మీ ఎనర్జీ చూస్తుంటే ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఇండిస్టీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. మీ ఆదరణ, ప్రేమ లేకపోతే ఈ ప్రయాణం జరిగేది కాదు. మీ ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలి. 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ ఎలా ఉందో సినిమా కూడా అంతే ఎంటర్టైనర్గా ఉంటుంది' అని తెలిపారు.'భారీగా తరలివచ్చి మీ ప్రేమని పంచిన అభిమానులకు కతజ్ఞతలు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి థాంక్స్. నితిన్ 'రానురాను..' పాటకు డ్యాన్స్ చేయడం చూస్తుంటే ఇరవై ఏళ్ల క్రితం ఎలా వున్నారో ఇప్పటికీ అదే ఫ్రెష్ నెస్‌తో ఉన్నారనిపిస్తుంది. ఆయన మంచి మనసు వల్లే ఇది సాధ్యపడింది. సముద్రఖని, కేథరిన్ థ్రెసాతో పని చేయడం అందాన్నిచ్చింది. దర్శకుడు రాజశేఖర్ గారి ఫస్ట్ మూవీ ఇది. నా ఫస్ట్ మూవీ 'ఉప్పెన' ఎంత సక్సెస్ అయ్యిందో ఆయనకి ఈ సినిమా ఆలాంటి సక్సెస్ ఇవ్వాలి. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నికితాలకి థ్యాంక్స్' అని నాయిక కతి శెట్టి అన్నారు. నిర్మాత నికితారెడ్డి మాట్లాడుతూ , 'ఈ ట్రైలర్‌ను గుంటూరులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అభిమానులు భారీ ఎత్తున ఈ వేడుకకు రావడం మరింత ఆనందంగా ఉంది. డబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ఈనెల 12న తప్పకుండా మా సినిమాని చూసి, చాలా పెద్ద విజయాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను' అని చెప్పారు.సముద్రఖని మాట్లాడుతూ, 'ఇదొక ఎక్స్ట్రార్డినరీ కమర్షియల్ మూవీ. ఇంత గొప్ప చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్.ఈ సినిమా తప్పకుండా మీ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది' అని తెలిపారు.దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, 'ఇప్పటివరకు ఎన్నడూ చూడని నితిన్‌ని ఈ సినిమాలో చూస్తారు. పవర్ఫుల్ మాస్ రోల్లో నితిన్ సరికొత్తగా కనిపిస్తారు. ఇది నాకు తొలి సినిమా అయినప్పటికీ నన్ను నమ్మి నితిన్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే కథని తెరకెక్కించే విషయంలో మా నిర్మాతలు సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డిగారు ఎక్కడా రాజీపడలేదు. ఈనెల 12న మీ ముందుకు వస్తున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్గా కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో జారు ఫుల్, బబ్లీ గర్ల్ పాత్ర చేశాను. నితిన్ గారు ఈ చిత్రంలో పవర్ఫుల్ మాస్ రోల్ కనిపిస్తారు. ప్రేక్షకులంతా థియేటర్లో మా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి' అని కేథరిన్ థ్రెసా చెప్పారు.జానీ మాస్టర్ మాట్లాడుతూ,'నితిన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నాకు మొదట అవకాశం ఇచ్చిన హీరో కూడా. ఆయన సాంగ్ అంటే ప్రాణం పెట్టి చేస్తాను. ఇందులో ఐటెం సాంగ్ మీ అందరినీ అలరిస్తుంది. నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి దర్శకుడు రాజశేఖర్, అంజలి, చిత్ర యూనిట్‌కి థ్యాంక్స్' అని అన్నారు.ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి, నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల, సంగీతం: మహతి స్వర సాగర్, డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్ : మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్.
ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంత మాస్ యాక్షన్ చూడలేదు. అదిరిపోయే మాస్ వైబ్ ఇచ్చిందీ ట్రైలర్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి మరో నిర్మాణ భాగస్వామి హరి.. కతి శెట్టి, కేథరిన్ థ్రెసా మిగతా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. నితిన్ గారి ఇరవై ఏళ్ల ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, తన హార్డ్ వర్క్‌తో మళ్ళీ టాప్‌లో నిలబడ్డారు.
- దర్శకుడు అనిల్ రావిపూడి