Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'.హొఇటీవలేహొఈ సినిమా టైటిల్‌ని రివీల్ చేశారు. తాజాగా ఆదివారం మోహన్ బాబు ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ప్రొఫెసర్ విశ్వామిత్రగా మోహన్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
'విశ్వామిత్ర.. తన ఆలోచనలతో, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల... డాషింగ్, డైనమిక్ సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్. గంభీరమైన లుక్‌తో మోహన్ బాబు ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఈ సినిమాలో అలరించబోతున్నారనిహొలుక్ చూస్తే అర్ధమవుతోంది.హొఫస్ట్ టైమ్ మోహన్ బాబు,హొలక్ష్మీప్రసన్న కలిసి తెర పంచుకుంటున్న ఈ చిత్రంలోహొసముద్రఖని కీలక పాత్ర చేస్తున్నారు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్‌గా నటిస్తున్నారు.
చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్య పాత్రలో, విశ్వంత్ కథా నాయకుడిగా, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్‌గా, లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
'అగ్ని నక్షత్రం' అంటూ టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా మంచు ఫ్యామిలీ అభిమానులకు మరింత ఆసక్తి పెరిగింది. తమ అభిమాన విలక్షణ నటుడు మోహన్‌బాబు ప్రొఫెసర్ విశ్వామిత్ర లుక్ అదిరిందంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. చాలా కాలం తర్వాత మోహన్‌బాబు ఈ తరహా భిన్న పాత్రను పోషించటం విశేషమంటూ, ఈ సినిమాతో ఆయన కచ్చితంగా 'పెదరాయుడు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.