Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి సమర్పణ (తెలుగు)లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతకంపై అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య నటీనటులుగా రూపొందిన చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'.
అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే సంయుక్తంగా నిర్మించారు. హాలీవుడ్లో సూపర్ హిట్ సాధించిన 'ఫారెస్ట్ గంప్' సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.
'ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజుగా కీలక పాత్రలో అమీర్ ఖాన్‌తో కలిసి సైనికుడిగా కనిపించబోతున్నారు.వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ విశేషంగా అలరిస్తాయి. ఇక అమీర్‌ఖాన్ నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో మరోసారి చూడబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండటం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థీమ్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మనం కథలోనా, కథే మనలోనా, ఏంటో ఈ విచిత్రం అనే పదాలతో తయారైనా ఈ పోస్టర్ ప్రేక్షక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ప్రీతిమ్, భారతీయ చిత్రానుకరణ : అతుల్ కుల్కర్ణి.