Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా ఎంత గొప్పగా నిర్మించామన్నది కాదు, ప్రమోషన్ ఎంత డిఫరెంట్‌గా చేశామన్నదే ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి ఇప్పటి నుంచే ప్రేక్షకులకు నచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని, వారి అభిరుచిని భూతద్దంలోంచి చూస్తున్నాడు మా భాస్కర్ నారాయణ. పురుషోత్తం రాజ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని మంగళవారం విడుదల చేశారు.
ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ గ్లింప్స్ ని చూస్తే ఇదొక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీలా అనిపించడమే కాదు, గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్ కథగానూ అనిపిస్తుంది. విలేజ్‌లో డిటెక్టివ్ ఏంటి అనిపిస్తుంది కదా..! అదే డైరెక్టర్ వినూత్నంగా ప్రెజెంట్ చేశారు. థ్రిల్ కలిగించే ఎంటర్టైన్మెంట్ చిత్రమే ఈ సినిమా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయడానికి చిత్ర బందం సన్నాహాలు చేస్తోంది.
అరుణ్, దేవీప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్, కమల్, గురురాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల.