Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జివిఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'.
వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రమిది.
రెగ్యులర్ స్టోరీలా కాకుండా డిఫరెంట్ కథతో వస్తున్న ఈ సినిమాలో భగవద్గీత, బైబిల్ ఖురాన్లలో అందమైన, పవిత్రమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా ఉంటుంది అని దర్శకుడు వెంకట్ వందెల చెప్పారు.
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 19న విడుదల కానుంది. తాజాగా 'నిలదీస్తుందా..' అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
'నిలదీస్తుందా నీడే తానే ఎవ్వరని..ప్రశ్నిస్తుందా ప్రశ్నను బదులే..వెతికేస్తుందా కన్నే చూపుని ఎక్కడని..' అంటూ సాగే ఈ విరహ గీతాన్ని హేమచంద్ర పాడగా, డా భవ్య దీప్తి రెడ్డి రచించారు. 'ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టు అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. నాయకా నాయికలు తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ పాత్రలు ప్రేక్షకుల్ని తమని తాము పోల్చుకునేలా చేస్తాయి. ఓ అందమైన, పవిత్రమైన ప్రేమకథగా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది' అని చిత్ర బృందం పేర్కొంది. తణికెళ్ళ భరణి, కల్పనా రెడ్డి, జీవా, జొగి బ్రదర్స్, అనంత్, బస్టాప్ కోటేశ్వరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ముల్లేటి నాగేశ్వరావు, సినిమాటోగ్రఫీ : పి.వంశీ ప్రకాష్, సంగీతం : సందీప్ కుమార్, స్క్రీన్‌ప్లే- పాటలు : డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి, ఎడిటర్ : నందమూరి హరి, స్టంట్స్ : రామకష్ణ, కొరియోగ్రఫీ: గణేష్ మాస్టర్, నండిపు రమేష్.