Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్ తాజాగా నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'. ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను భిన్నంగా చేస్తోంది. మహతి స్వర సాగర్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించారు. మొదటి రెండు పాటలు ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయి. మూడో పాట 'అదిరిందే'ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు.
సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఈ పాటని ఫ్యూజన్ వెస్ట్రన్ టచ్‌తో ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌గా స్వరపరిచారు.
పాట వినిపించిన విధానం చెవులకి ఇంపుగా ఉంది. పాటలో నితిన్, కతి శెట్టి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. స్టయిలీష్ అండ్ కూల్‌గా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అందర్నీ అలరించాయి. కష్ణకాంత్ అందించిన సాహిత్యం క్యాచీగా ఉంది. ఈ ఆల్బమ్‌లో మరో అదిరిపోయే చార్ట్‌బస్టర్ సాంగ్ చేరిందని ఈ పాట చూస్తే అర్థమవుతోందని చిత్ర బృందం తెలిపింది.
ఇటీవల రిలీజ్ చేసిన 'మాచర్ల దమ్కీ..'కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఇందులో నితిన్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ఆయన కెరీర్లోనే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌కి సైతం అనూహ్య స్పందన లభించింది.
కతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ సాంగ్ 'రారా రెడ్డి..'లో సందడి చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.
'పొలిటికల్ థ్రిల్లర్స్ ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే వాటికి భిన్నంగా, సరికొత్తగా ఉంటుందీ చిత్రం. అలాగే నితిన్ పొలిటికల్ థ్రిల్లర్‌లో తొలిసారి నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టరైజేషన్ కూడా సరికొత్త ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు, ముఖ్యంగా నితిన్ అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయి. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే దీమాతో మేకర్స్ ఉన్నారు' అని చిత్రయూనిట్ తెలిపింది.
సముద్రఖని, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల, సంగీతం: మహతి స్వర సాగర్, డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్ : మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్.