Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్.వై.ఎమ్హొక్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం '1948-అఖండ భారత్'. అన్ని భారతీయ, ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్, నాథురాం గోడ్సేగా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభారు పటేల్‌గా శరద్ దద్భావల, నెహ్రూగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్‌గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించగా, సుమారు 92 ముఖ్య పాత్రలతో అత్యంత భారీగా నిర్మాణం పూర్తి చేసుకుంది.
ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి, బాలకష్ణ 'అఖండ' తరహాలో విజయం సాధించే చిత్రమని, తెలుగువారంతా గర్వపడేలా ఈ చిత్రాన్ని రూపొందించారని యూనిట్‌ని అభినందించారు. దర్శకుడు ఈశ్వర్డి.బాబు మాట్లాడుతూ, '11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి... 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్‌లో, 9 షెడ్యూల్స్‌లో, ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అని అన్నారు. 'ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉంది. దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే, ముంబైలో చేయించాం' అని నిర్మాత ఎమ్.వై.మహర్షి చెప్పారు.