Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ సాధించిన బొడ్డు అశోక్ సినిమారంగంలోనూ నిర్మాతగా తానేమిటో నిరూపించుకోవాలనే లక్ష్యంతో నిర్మించిన చిత్రం 'పుష్పరాజ్ ది సోల్జర్'.
ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ, 'అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా, కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ధ్రువ సర్జా, రచితా రామ్ హరిప్రియ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇదొక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పుష్పరాజ్ పేరు ఎంతో ఫేమస్ అయ్యింది. ఎప్పుడైతే ఈ టైటిల్ పెట్టామో మా సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నాకు నిర్మాతగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ఈనెల 19న గ్రాండ్గా తెలుగు రాష్ట్రాల్లో మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు' అని తెలిపారు.