Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూ సర్స్ కౌన్సిల్, అందరి నిర్మాతల సహకారంతో సినిమా చిత్రీకరణలను నిర్విరామంగా జరుపుతూ ముందుకు వెళ్తున్నాం. ఇందులో బంద్‌లు, స్ట్రైక్‌లు లేవు. పరిశ్రమకి సంబంధించి ఏ విషయంలోనైనా నిర్మాతలందరం కలిసి కట్టుగా ఉందాం' అని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి. కళ్యాణ్ అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 'ఓటీటీకి ఎన్ని వారాల్లో సినిమాను ఇవ్వాలన్న దానిపై ఒక కమిటీ వేశాం. అలాగే విపిఎఫ్ ఛార్జెస్ చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి ఎలా ఉండాలి అనేదాని మీద ఒక కమిటీ వేశాం. ఫెడరేషన్ వర్కర్స్ వేజెస్ పెంపు విషయంపై నేనే ఈ కమిటీకి చైర్మన్‌గా ఉంటూ, దీని పరిష్కారం కోసం చర్చించుకుంటున్నాం. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు చిత్రీకరణల్లో జరుగుతున్న వేస్టేజ్ గురించి కూడా తెలుసుకోవడానికి ఓ కమిటీ వేశాం. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇవన్నీ మెయిన్ బాడీస్. మేము కొంతమంది గిల్డ్ అనే సంస్థను పెట్టుకున్నాం. అందులో నిర్మాతల సమస్యలను మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఫైనల్‌గా తెలుగు ఫిలిం ఛాంబర్‌కు వచ్చి సమస్యలను పరిష్కరించుకుంటాం. చాలా మంది నా పేర్లు వాడుతున్నారు. నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ దిల్ రాజుకు పర్సనల్ ఎజెండా లేదు. నేను మన అందరి సినిమాల కోసం, మీరందరు ఇచ్చే సపోర్ట్‌తో పని చేస్తున్నాను. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, సినిమా వ్యవస్థ ముఖ్యం, అంతేగాని ఇవాళ మేము ఇక్కడ ఉంటాం. రేపు వెళ్ళిపోతాం. మేమంతా సినిమా కోసమే పని చేస్తున్నాము. త్వరలోనే మా చర్చల ఫలితాలను తెలియజేస్తాం' అని తెలిపారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, 'కరోనా తరువాత సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. దానివల్ల ప్రొడ్యూసర్స్‌కు ఎక్కువ నష్టం వచ్చింది. కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున ప్రొడ్యూసర్స్‌కు సపోర్ట్ చేేస్తున్నాం. అయితే మీడియాలో మాత్రం చాలా భిన్నంగా రాస్తున్నారు. అవేవీ వాస్తవాలు కాదు. మేమంతా ఒక్కటిగా ఉంటూ పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. దీనికోసం అందరూ ఎంతో సహకరిస్తున్నారు. త్వరలోనే మంచి మంచి నిర్ణయాలతో మీముందుకు వస్తాం' అని చెప్పారు.