Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్' (సాలా క్రాసబ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్). ఈనెల 25న
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ వెండితెరకు పరిచయం అవుతున్నారు.
'ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు సింగిల్స్ 'అక్డీ పక్డీ', 'వాట్ లగా దేంగే' సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. లేటెస్ట్గా ఈ చిత్రంలోని మూడవ పాట 'ఆఫత్..' విడుదలైంది.
అందమైన బీచ్ హౌస్ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. రమ్యకృష్ణ తన కొడుకు విజయ్ దేవరకొండకు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండమని చెప్పడం, విజయ్, అనన్య ఇంటి నుండి స్టాఫ్బ్లాక్లో జంప్ అవ్వడం,
బీచ్‌లో ఆడిపాడటం లవ్లీగా ఉంది. ఈపాటలో విజయ్, అనన్యల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. విజయ్ సూపర్ హ్యాండ్సమ్గా కనిపిస్తుంటే, అనన్య నాజూకు అందాలు అందర్నీ ఫిదా చేస్తున్నాయి. డాన్స్ మూమెంట్స్ కూడా అందంగా ఉన్నాయి. తెలుగు పాటని సింహా, శ్రావణ భార్గవి అలపించిన తీరు కూడా అంతే అద్భుతంగా ఉంది. ఇక గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటకు అందించిన యూత్ ఫుల్ లిరిక్స్ సైతం అలరిస్తున్నాయి. ఈ పాటకు తనిష్క్ బాగ్చి అద్భుతమైన సంగీతాన్ని అందించగా, పియూష్-షాజియా కొరియోగ్రఫీ బ్రిలియంట్‌గా ఉంది. అజీమ్ దయాని మ్యూజిక్ సూపర్వైజర్గా వ్యవహరించారు. 'ఆఫత్..' పాట ఆడియోతో పాటు విజువల్స్‌తో మెస్మరైజ్ చేసిన అందమైన బీచ్ సాంగ్‌గా ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే సినిమాలోని లవ్ ట్రాక్ యూత్‌ని క్రేజీగా అలరించనుందని వేరే చెప్పక్కర్లేదు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది' అని చిత్ర బృందం తెలిపింది.