Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ సృష్టిలో మానవు లందరూ ఒకటే. కుల, మత భేదాలకు అతీతమైన మన భారత దేశంలో ఐకమత్యం ప్రకాశిస్తున్న ఇటువంటి తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా 'మానవతా పరిమళం' చిత్రాన్ని నిర్మించానని నిర్మాత వాశిరాజు ప్రకాశం తెలిపారు. 30 నిమిషాల నిడివిగల ఈ చిత్రం ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందడటంతోపాటు ఈ తరహా చిత్రాల ఆవశ్యకతను గుర్తు చేసింది.
ఈ నేపథ్యంలో నిర్మాత వాశిరాజు ప్రకాశం మాట్లాడుతూ, 'బ్రాహ్మణులు, ముస్లిమ్‌లు, దళిళులు.. అందరూ అన్నదమ్ముల్లా మెలగాలి. ఆత్మీయానుబంధాలను పెంపొందించుకోవాలనే నీతి బోధతో సాగిన మా 'మానవతా పరిమళం'కు మంచి స్పందన లభించటం చాలా ఆనందంగా ఉంది. ఇందులోని అంశాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేసిన దళిత సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. అలాగే ఆయన ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఈ సినిమా ఉందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపించడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించే క్రమంలో నన్నెంతగానో ప్రోత్సహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌గారికి, హోంశాఖా మంత్రి మహమూద్ ఆలీగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాను కేవలం తెలుగు భాషకే పరిమితం చేయకుండా అన్ని భారతీయ భాషల్లోనూ అనువదిస్తాం. ఆత్మీయానుబంధాలకు ప్రతీకగా నిలిచే రీతిలో ఈ చిత్రాన్ని నిర్మించటం గర్వంగా ఉంది' అని చెప్పారు.