Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమదేశం'. అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై, అద్భుతమైన స్పందన రాబట్టుకుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, '1996లో విడుదలై, సూపర్ హిట్ సాధించిన సినిమా 'ప్రేమదేశం'. ఈ సినిమా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుని, ఉర్రూతలూగించింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. చాలా కాలం తర్వాత అదే టైటిల్‌తో వస్తున్న 'ప్రేమదేశం' సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆయన తన బ్యాగ్రౌండ్ స్కోర్, సంగీతంతో ఈ సినిమాకి ప్రాణం పోశారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని 'పదములే లేవు పిల్ల' పాట కూడా అన్ని మాధ్యమాల్లో టాప్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో నటించిన వారందరూ కొత్తవారైనా చాలా చక్కగా నటించారు. టీజర్ చివరిలో సీనియర్ నటి మధుబాల గారి మీద వచ్చే సన్నివేశం సినిమా మీద మరింత ఆసక్తి పెంచింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపారు. మాయ, అజరు కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల భరణి, వైష్ణవి చైతన్య తదితరులు ఈ చిత్రంలోని ఇతర ముఖ్య తారాగణం.