Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్' (సాలా క్రాస్‌బ్రీడ్). బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ తెరకు పరిచయం అవుతున్నారు.
పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన నటుడు విష్ మీడియాతో మాట్లాడుతూ, '2015లో పూరీగారిని కలిశా. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా చేస్తానని, అప్పుడే 'లైగర్' ఐడియా చెప్పి టచ్‌లో ఉందామని చెప్పారు. ఆయన 'మెహబూబా', 'ఇస్మార్ట్ శంకర్', 'రొమాంటిక్' చిత్రాలు చేశాను. చాలా కాలంగా మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్నాను. నిరంతర శ్రమ ఉంటుంది. ఎట్టకేలకు 'లైగర్'తో నా కల తీరింది. పూరి గారు, విజరు దేవరకొండ, రమ్యకష్ణ, మైక్ టైసన్ .. ఒక డ్రీమ్ కాంబినేషన్. చాలా అదష్టంగా భావిస్తున్నా. లైగర్ లాంటి పాన్ ఇండియా మూవీలో చేయడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది' అని అన్నారు.