Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన చిత్రం 'సీతారామం'. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన చిత్రమిది. హను రాఘవపూడి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో 'సీతారామం'కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కతజ్ఞతలు తెలుపుతూ
చిత్ర యూనిట్ థ్యాంక్యూ
మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ,
వైజయంతి బ్యానర్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్న స్వప్న, ప్రియాంకకి కతజ్ఞతలు. ఈ సినిమా చూసి చాలా జెలసీ ఫీలయ్యాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్‌కి వెళ్ళింది (నవ్వుతూ). 'గీతాంజలి, సంతోషం, మన్మథుడు' రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దర్శకుడు హను చాలా వివరంగా, అద్భుతంగా తీశారు. ఇంటర్వెల్ పాయింట్లో ఎవరూ ఊహించని రీతిలో లాక్ చేశారు. సెకండ్ హాఫ్ అత్యద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. ఇంత అందమైన చిత్రం చూసి చాలా రోజులైంది. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. గత వారం విడుదలైన 'బింబిసార, సీతారామం' చిత్రాలను ఆదరించి, మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు' అని తెలిపారు. ''సీతారామం'ని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు నా హదయపూర్వక కతజ్ఞతలు. రామ్ పాత్ర నా కెరీర్లో చాలా స్పెషల్. ఇంత గొప్ప పాత్రని రాసిన హను గారికి కతజ్ఞతలు' అని దుల్కర్ సల్మాన్ చెప్పారు.