Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ శైలేంద్ర, మేఘా ఆకాష్ జంటగా లంకా శశిధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓం శ్రీ 'కనకదుర్గ'. నెక్స్ జెన్ పిక్చర్స్ పతాకంపై లంక ఫణిధర్ సమర్పణలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా నిర్మితం కానుంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగాయి. ఈ చిత్రంలో కనకదుర్గ దేవతగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం విశేషం.
నిర్మాత సైలేంద్ర బాబు స్క్రిప్ట్ అందించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత అంబికా కష్ణ హీరో, హీరోయిన్ల పై ముహూర్తపు షాట్‌కు క్లాప్ ఇచ్చారు. నిర్మాత డి.యస్.రావు కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ,'లంక శివశంకర్ ప్రసాద్ గతంలో చాలా సినిమాలు తీశారు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను. మంచి టైటిల్‌తో, మంచి మనసు ఉన్న మనుషులతో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
'ఇది నా మొదటి చిత్రం. మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని, భారీ గ్రాఫిక్స్‌తో లవ్ అండ్ ఎంటర్టైనర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మా సినిమాని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తాం' అని చిత్ర దర్శక, నిర్మాత లంకా శశిధర్ చెప్పారు. చిత్ర హీరో సుమంత్ శైలేంద్ర మాట్లాడుతూ,'ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్, మేఘా ఆకాష్, మురళి మోహన్‌గారితో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.
'ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. కొత్త మేఘాను చూస్తారు' అని హీరోయిన్ మేఘా ఆకాష్ తెలిపారు.