Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్.వై.ఎమ్హొక్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం '1948-అఖండ భారత'్. నేడు (శుక్రవారం) ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్, నాథురాం గాడ్సేగా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభారు పటేల్‌గా శరద్ దద్భావల, నెహ్రూగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్‌గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందంతోపాటు విశ్వహిందూ పరిషత్, జై భజరంగ్ దళ్ నాయకులు శ్రీనివాస్ రాజ్, శివరాములు, మహేష్ యాదవ్ పాల్గొని, మన తెలుగు వారంతా గర్వపడే చిత్రంగా దీన్ని పేర్కొన్నారు. గాంధీని గాడ్సే చేసింది హత్య కాదని, దేశ విశాల ప్రయోజనాల కోసం చేసిన వధగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారని అన్నారు. గాడ్సే కోణం వెలుగులోకి రాకుండా దాచిపెట్టిన ఎన్నో విషయాలను ఈ సినిమాలో నిష్పక్షపాతంగా చూపించటం విశేషమన్నారు.