Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా విడుదలైన గంటల్లోనే వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తూ దక్షిణాది చిత్రాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న 'తమిళ్ రాకర్స్' గురించి వేరే చెప్పక్కర్లేదు. వీళ్ల నెట్ వర్క్ ఎలా పనిచేస్తోంది అనే నేపథ్యంతో ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించిన వెబ్ సిరీస్ 'తమిళ్ రాకర్స్'. ఈ సినిమాలో అరుణ్ విజరు, వాణి బోజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అరుణ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు అరివఝగన్ రూపొందించారు. సోని లివ్ ఓటీటీలో ఈనెల 19న ఈ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా మీడియాతో దర్శకుడు అరివఝగన్ మాట్లాడుతూ, 'తమిళ్ రాకర్స్ సినిమాలను ఎలా ఫిల్మింగ్ చేస్తున్నారు. ఎలా అప్లోడ్ చేస్తున్నారు. వీళ్లు ఇలా కొత్త సినిమాలను వెబ్ సైట్లో పెట్టడం వల్ల ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు. వీళ్లనెట్ వర్క్ ఎలా పని చేస్తోంది అనే ప్రశ్నలకు మా చిత్రంలో సమాధానం చెప్పబోతున్నాం. ఇందులో భాగంగా జరిగే ఇన్వెస్టిగేషన్లో అరుణ్ విజరు, వాణి బోజన్ కీలక పాత్రల్లో ఆకట్టుకుంటారు' అని అన్నారు. హీరో అరుణ్ విజరు మాట్లాడుతూ, 'ఈ సిరీస్ ద్వారా తమిళ్ రాకర్స్ ముఠాను వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించాం' అని తెలిపారు.