Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం 'దిల్ వాలా'. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, అలీ కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో అల్లరి నరేష్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కు అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ, 'మా నిర్మాతలు నబీషేక్, తూము నర్సింహా గారు ఈ చిత్రంతో డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్‌ని ప్రారంభించారు. నేను కథ చెప్పగానే అంగీకరించిన నరేష్ అగస్త్యకి థ్యాంక్స్. శ్వేత అవస్తి మంచి నటి. నా చిత్రం 'పూలరంగడు'కి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డీవోపీ అనిత్ నాకు చాలా కాలంగా తెలుసు. మంచి టెక్నిషియన్స్ ఈ చిత్రంలో పని చేస్తున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు.
'వీరభద్రం చౌదరి గారు కథ చెప్పిన తర్వాత మూడు రోజుల్లోనే సినిమా ఓకే చేశా. ఈ సినిమా కోసం ఎక్కడా రాజీపడకుండా వందశాతం నా బెస్ట్ ఇస్తాను. మొదటిసారి ఒక కమర్షియల్ సినిమా చేస్తున్నా' అని హీరో నరేష్ అగస్త్య అన్నారు. నిర్మాత నబిషేక్ మాట్లాడుతూ, 'ఓ మంచి కథతో రూపొందుతున్న చిత్రంతో నిర్మాతలుగా పరిశ్రమకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు. 'మంచి టీమ్‌తో కలిసి పని చేస్తునందుకు చాలా ఆనందంగా ఉంది. కథ, కాన్సెప్ట్ చాలా నచ్చింది. అలాగే నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలు థ్యాంక్స్' అని కథానాయిక శ్వేత అవస్తి చెప్పారు.
అలీ రాజా మాట్లాడుతూ, 'మంచి క్రైమ్ కామెడీతో మీ ముందుకు రాబోతున్నాం. నరేష్, నేను పదేళ్ళు తర్వాత కలిసి పని చేయబోతున్నాం. 2013లో అన్నపూర్ణలో వీరభద్రం చౌదరి గారు షూటింగ్లో ఉన్నప్పుడు అవకాశం కోసం అడిగేవాళ్ళం. ఎట్టకేలకు ఆయన సినిమాలో నటించే అవకాశం దొరకటం ఆనందంగా ఉంది' అని అన్నారు.
క్రైమ్ కామెడీ జోనర్లో రూపుదిద్దుకోబోతున్నఈ చిత్రంలో అలీ రాజా, దేవ్ గిల్ , అలీ పోసాని, బ్రహ్మజీ, రఘుబాబు, సుదర్శన్, భద్రం, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, మాణిక్, గోవిందరావు, గోవర్ధన్, ఎస్తార్, ప్రగతి, లయ, లహరి, హిమజ, శిరీష తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:వీరభద్రం చౌదరి, సంగీతం: అనూప్ రూబెన్స్,
మాటలు: శంకర్, కెమెరా : అనిత్, ఆర్ట్ డైరెక్టర్ : ఉపేంద్ర, ఎడిటర్ : చోటా కె ప్రసాద్.