Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంజన చరణ్ సమర్పణలో ఎస్ఎస్ మూవీ కార్పోరేషన్ బ్యానర్‌పై సతీష్ మేరుగు, హృతికా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఏరు బుజ్జి నీకు నేనే'. హీరోగానే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలను సతీష్ మేరుగు నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఆడియో సీడీని ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మంచి కంటెంట్‌తో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ రోజుల్లో సినిమాకి ఒక బాధ్యతని నిర్వహించడమే చాలా కష్టం. అలాంటిది ఈ సినిమా కోసం అన్నీ తానై.. ఒక మంచి ప్రోడక్ట్ బయటికి రావడానికి కారణమైన సతీష్ మేరుగును అభినందిస్తున్నాను. సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
'ఒక సినిమాకు పని చేయడం అంటే చాలా గొప్ప విషయం. సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత ఈ సినిమాకు నేను పడిన కష్టం అంతా మరిచిపోయాను. అంత బాగా అవుట్‌పుట్ వచ్చింది. నిర్మాత బెక్కం వేణుగోపాల్‌గారి సహకారం మరువలేనిది. ఈ సినిమాలో మంచి ప్రేమకథే కాకుండా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుందని ఆశిస్తున్నాను. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం' అని హీరో, దర్శక, నిర్మాత సతీష్ మేరుగు చెప్పారు. సతీష్ మేరుగు, హతికా సింగ్, దేవా, అభినవ్ సింగ్ రాఘవ్, మాధవి ప్రసాద్, కొండపల్లి హరిప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: మేనుగ శ్రీను, మ్యూజిక్: గౌతమ్ రవిరామ్, రీరికార్డింగ్: ఎమ్.ఎల్.రాజు, కెమెరా: రాము గడుతూరి, ఫైట్స్: అవినాష్, కొరియోగ్రాఫర్: హరి తాటిపల్లి.