Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం 'భళా చోర భళా'. పక్కా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా, ఏ.జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేయబోతున్న సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ,'తక్కువ బడ్జెట్లో లిమిటెడ్ డేస్‌లో మంచి సినిమా చేయాలని ప్లాన్ చేశా. అదే 'భళా చోర భళా'గా మీ ముందుకు రాబోతోంది. మా నాన్న ఏవిఎస్ గారిపై ఉన్న అభిమానంతో సినిమాకి సంబంధించిన వారందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన లేకపోయినా మాకు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమాను మా అమ్మగారి పుట్టినరోజు కానుకగా ఈనెల 26న విడుదల చేస్తున్నాం. అందరికీ మా సినిమా నచ్చుతుందని భావిస్తున్నా. అలాగే ఈ సినిమాలో నేను కూడా ఒక పాత్ర చేశాను. చాలా తక్కువమంది ఆర్టిస్టులతో చేసిన సినిమా ఇది' అని చెప్పారు.