Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బుజ్జి ఇలా రా'. 'సైకలాజికల్ థ్రిల్లర్' అనేది ట్యాగ్‌లైన్. చాందినీ అయ్యంగార్ హీరోయిన్.
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జి.నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గరుడవేగ అంజి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు. తాజాగా హీరో అల్లరి నరేష్ ముఖ్య అతిథిగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ,'జి.నాగేశ్వర రెడ్డి గారు నాకు ఇష్టమైన దర్శకులు. నా కెరీర్లో 'సీమశాస్త్రి, సీమటపాకారు' లాంటి పెద్ద విజయాలు ఇచ్చారు. అంజి కెమెరామెన్ అవ్వకముందే నాకు తెలుసు. వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా బాగుంటుంది. సాయి కార్తిక్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ట్రైలర్లో వచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. థియేటర్లో ప్రేక్షకులకు ఈ సినిమా థ్రిల్ ఇస్తుందని భావిస్తున్నాను. సునీల్‌గారితో 'తొట్టిగ్యాంగ్' నుండి మా ప్రయాణం కొనసాగుతోంది. ధనరాజ్ నేను చాలా సినిమాలు కలిసి చేశాం. ధనరాజ్‌కి మంచి సినిమా కుదిరింది' అని తెలిపారు. 'నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నాగేశ్వరరెడ్డి గారికి, నిర్మాతలకు రుణపడి ఉంటాను. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. మీ అందరికి సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది' అని దర్శకుడు అంజి అన్నారు.
జి.నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, 'కథ అద్భుతంగా రాయగానే సరిపోదు. అది నటీనటుల నటన బట్టే అద్భుతం అవుతుంది. అది ఈ సినిమాకి జరిగింది' అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ,'నాగేశ్వర రెడ్డి కథకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాని అంజిగారు అద్భుతంగా తీశారు. ఖచ్చితంగా మీ అందరినీ ఆకట్టుకుంటుంది' అని తెలిపారు.