Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో రాబోతున్న ఆసక్తికర చిత్రం 'కమిట్ మెంట్'. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం' 'కమిట్ మెంట్'. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న తేజస్వి మడివాడ మాట్లాడుతూ,
ౖ'ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయి. అందులో ఒకటి నా స్టోరీ. ఇందులో నా క్యారెక్టర్ సినిమా అవకాశాల కోసం తిరిగే క్యారెక్టర్. నిజం చెప్పాలి అంటే శ్రీరెడ్డి గారి క్యారెక్టర్‌కి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీ, ఇండిస్టీలో జరిగే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ స్టోరీ వినగానే ఓకే చేశాను. ఈ సినిమా ద్వారా ఇండిస్టీని బజార్నా పడేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే అలా అనిపించి ఉండొచ్చు. వాస్తవానికి సినిమాలో మంచి కంటెంట్‌తోపాటు మెసేజ్ ఉంటుంది . అందరూ సినిమా ఇండిస్టీని బద్నామ్ చేస్తారు. కానీ ఇది అన్ని ఇండిస్టీల్లో ఉంది. మన గ్లామర్ ప్రపంచంలో ఉంటాం కనుక మనకి అందరికి ప్రాబ్లెమ్‌గా ఉంటుంది. సినిమా ఇండిస్టీని బద్నామ్ చేయద్దు అని చెప్పేదే ఈ సినిమా మెసేజ్. ఈ సినిమా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటివరకు చేసిన సినిమాలతో నా పర్సనాలిటీకి గుర్తింపు వచ్చిందే తప్ప నా నటనకి రాలేదు. ఈ సినిమాతో వస్తుంది అని అనుకుంటున్నాను. నాకు బ్రేక్ కచ్చితంగా వస్తుంది. తెలుగుతోపాటు తమిళంలో కూడా యాక్ట్ చేశాను. అయితే నాకు తమిళ ఇండిస్టీ నచ్చలేదు. అందుకే మానేశాను. మంచి కథలు వస్తే బాలీవుడ్లోనేకాదు అన్ని భాషల్లోనూ నటిస్తాను' అని తెలిపింది.