Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'.
విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డిహొ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
పాయల్ రాజ్‌పుత్ కథానాయిక. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ,'ఇది పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. మా నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి గారు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. ఇప్పటి వరకు మేం అన్ని పాటలు ఆన్ లైన్లోనే రిలీజ్ చేసాము. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని తెలిపారు.
'మా దర్శకుడు కళ్యాణ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించాను. ఇందులో ఆది సాయికుమార్ నట విశ్వరూపం చూడబోతున్నారు. ఆయన పాత్రలో ఉన్న వేరియేషన్స్ అందర్నీ అలరిస్తాయి. వేేుం విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. ఈ నెల 19న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగాకోరుతున్నాను' అని నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి చెప్పారు.