Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోడి రామకృష్ణ గారి సమర్పణలో కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కిరణ్ అబ్బవరం హీరోగా, సంజన ఆనంద్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'.
శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుండి 'నచ్చావ్ అబ్బాయి' అంటూ సాగే పాట విడుదలైంది.
ఈ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మాస్ బీట్తో సాగే ఈ పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మాస్ లుక్ హైలెట్ కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోని లహరి ద్వారా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. 'నచ్చావ్ అబ్బా..రు నచ్చావ్ అబ్బా..రు పిచ్చి పిచ్చిగా.. నచ్చావ్ అబ్బారు.. పోనీలే అమ్మారు ఇన్నాళ్లకీ..మంచి మంచి మాట చెప్పావమ్మా..రు' అంటూ సాగే ఈ పాటకు భాస్కరపట్ల అందించిన లిరిక్స్ అందరూ పాడుకొనేలా చాలా క్యాచీగా ఉన్నాయి. రాజ్ కె. నల్లి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. భాను మాస్టర్ కోరియోగ్రపీలో కిరణ్ డాన్స్ చాలా చూడముచ్చటగా ఉంది. ఈ పాటకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ నచ్చిందని ఈ సినిమాకి పెట్టాం. కథకు తగ్గట్టే ఈ టైటిల్ ఉంది. ఈ సినిమాలో చాలా ట్విస్ట్, టర్న్స్ ఉంటాయి. మేము విడుదల చేసిన రెండు సాంగ్స్ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. కోడి రామకృష్ణ గారి వంటి పెద్ద బ్యానర్లో సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. దీప్తి గారు నన్ను తమ్ముడిలా చాలా బాగా చూసుకున్నారు. 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమా తర్వాత శ్రీధర్‌తో మళ్ళీ రిపీట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అని తెలిపారు.
''ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాని మించి ఈ సినిమా ఉంటుంది. చిరంజీవి గారి 'గ్యాంగ్ లీడర్' తరహాలో ప్లాన్ చేసి ఈ సినిమా తీశాం. ఇందులో బాబా మాస్టర్, కిరణ్ కాంబినేషన్ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలి' అని దర్శకుడు శ్రీధర్ గాదె అన్నారు.
చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి మాట్లాడుతూ, 'మంచి ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. రాజ్ కె. నల్లి ఈ సినిమాకు మంచి విజువల్స్ ఇచ్చాడు. కిరణ్, శ్రీధర్ది మంచి కాంబినేషన్. అలాగే మణిశర్మ మ్యూజిక్, బాబా భాస్కర్, యస్.వి. కృష్ణారెడ్డి.. ఇలా ఈ సినిమాకు మంచి టీం దొరికింది. ఈ సినిమా మా బ్యానర్‌కి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని చెప్పారు.