Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ హీరో విజయ్ ఆంటోని నటిస్తున్న నూతన సినిమా 'హత్య'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్.బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా, ప్రసాద్ ల్యాబ్స్‌లో సందడిగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత జి. ధనుంజయన్ మాట్లాడుతూ, 'విజయ్ ఆంటోనీ గారితో మేం ఐదు చిత్రాలు చేస్తున్నాం. గతంలో 'విజయ రాఘవన్' రిలీజ్ చేశార. ఇప్పుడు 'హత్య', త్వరలో 'దోషి' అనే మరో మూవీ నిర్మిస్తున్నాం. ఈ సినిమా పూర్తిగా దర్శకుడి విజన్. ఆయన అడిగినంత సమయాన్ని ఇచ్చి, ఓ మంచి చిత్రాన్ని నిర్మించాం' అని తెలిపారు.
'విజరు ఆంటోనిగారు 'బేతాళుడు' చిత్రంలో నాకొక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాను ఆయనతో ప్రొడ్యూస్ చేయడం సంతోషంగా ఉంది' అని మరో నిర్మాత సిద్ధార్థ్ శంకర్ చెప్పారు.
దర్శకుడు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, 'ఇదొక టిపికల్ మర్డర్ మిస్టరీ. లైలా అనే అమ్మాయి మర్డర్ నేపథ్యంతో సాగుతుంది. ఆ హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు అనే ప్రశ్నలు కథలో కీలకంగా ఉంటాయి. సినిమాలో సర్ప్రైజ్ చేసే అంశాలెన్నో ఉంటాయి' అని అన్నారు. 'దర్శకుడు బాలాజీ కుమార్ ఆల్ రౌండర్. ఆయనకు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ...ఇలా ప్రతి క్రాఫ్ట్ మీద పట్టుంది. ఈ చిత్రాన్ని వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కించారు. సంగీత దర్శకుడు గిరీష్ హాలీవుడ్ స్థాయి సంగీతాన్ని ఇచ్చారు' అని హీరో విజయ్ ఆంటోని చెప్పారు.