Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'వాంటెడ్ పండుగాడ్'. 'పట్టుకుంటే కోటి' అనేది ట్యాగ్ లైన్.
శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ, 'సినిమాలకు పూర్వ వైభవం వచ్చింది. 'సీతారామం, బింబిసార, కార్తికేయ 2' వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంటర్టైనింగ్ మూవీగా ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
'రాఘవేంద్రరావుగారి సినిమాల్లో పళ్లు ఉంటాయి. కానీ ఈ సినిమాలోనే పండుంది. సాధారణంగా దేవుడు (గాడ్) దగ్గరకి పళ్లు తీసుకెళతాం కదా.. అందుకే పండు, గాడ్ అని రెండింటినీ టైటిల్లో పెట్టాం. ఇప్పటి సినిమాల్లో కమెడియన్స్ నటిస్తున్న వారందరం ఇందులో నటించాం. నేను కూడా చాలా కీలకమైన పాత్రలో నటించాను' అని సునీల్ అన్నారు.
అనసూయ మాట్లాడుతూ, 'ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. అందరూ సినిమా చూసి ఎంజారు చేయాలని కోరుకుంటున్నాను. రాఘవేంద్రరావుగారికి థ్యాంక్స్. టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా' అని చెప్పారు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ, 'రాఘవేంద్రరావుగారి సినిమాలు చూస్తూ పెరిగిన మాకు, ఆయన సినిమాల్లో నటించే అవకాశం రావటం అదష్టంగా భావిస్తున్నాం. ఆయన సినిమాలో ఓ సీన్లో కనిపిస్తే చాలనుకున్నాం. అలాంటిది పిలిచి సినిమానే ఇచ్చారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి థ్యాంక్స్' అని తెలిపారు.
'ఈ 19న హిట్ కొట్టబోతున్నాం. రాఘవేంద్రరావుగారి ఋణం తీర్చుకోలేనిది. ఇప్పుడు మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నా. అందులో ఫస్ట్ 'పండు గాడ్' రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది' అని దర్శకుడు శ్రీధర్ సీపాన అన్నారు.