Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''క్రష్'' సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమై, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభరు సింహా రెడ్డి. తాజాగా టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న తాజా చిత్రం 'కమిట్ మెంట్'..
రచన మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభరు సింహా రెడ్డి నటీ నటులుగా రూపొందింది. లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలక పాత్ర పోషించిన అభరు సింహారెడ్డి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'నటుడు, నిర్మాత, దర్శకుడైన మా నాన్న సతీష్ రెడ్డి గారు 'గోవా, ఓ ప్రియతమా, దాదాగిరి, ప్రేమ ఎక్కడ నీ చిరునామా' వంటి మూవీస్ చేశారు. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని పరిశ్రమలోకి వచ్చాను. నా ఫస్ట్ మూవీ 'కమిట్ మెంట్' అయినా రవిబాబు గారి దర్శకత్వంలో చేసిన 'క్రష్' సినిమా ముందు రిలీజ్ అయ్యింది.ఆ సినిమాకి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా పోస్టర్ చూస్తే ఒకలా ఉంటుంది. సినిమా చూస్తే మరోలా ఉంటుంది. ఇందులో ఉన్న నాలుగు స్టోరీస్‌లో నాది క్యూట్ లవ్‌స్టోరీ. ప్రజెంట్ యూత్ ఎలా వుంటున్నారు వారికీ ఎలాంటి ప్రాబ్లెమ్ వస్తాయి, వాటిని ఎలా ఓవర్ కమ్ అవుతారు అనేది ఇందులో చూయించాం. కంటెంట్ పరంగా ప్రతి మహిళ చూడాల్సిన చిత్రమిది' అని తెలిపారు.